వైభవంగా బొడ్రాయి ప్రతిష్ట భూమి పూజ
SDPT: జగదేవ్‌పూర్ మండలంలోని పలుగుగడ్డ గ్రామంలో గ్రామ దేవత బొడ్రాయి ప్రతిష్ట కోసం భూమి పూజ కార్యక్రమం మంగళవారం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించబడింది. గ్రామ సర్పంచ్ నర్ర కనకయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.