విశాఖ బీచ్ రోడ్డులో ముమ్మరంగా వాహనాల తనిఖీలు

VSP: పాక్- భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో విశాఖ పోలీసులు అప్రమత్తమయ్యారు. బీచ్ రోడ్డులో పహారా పెంచారు. ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీ చేశారు. సాగర్ నగర్ మొదలుకొని ఆర్కే బీచ్ వరకు వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించారు.