VIDEO: హాస్టల్ వార్డెన్ పై ఎమ్మెల్సీ ఆగ్రహం
KDP: పులివెందుల ఎస్టీ హాస్టల్‌ను ఆదివారం ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పరిశీలించారు. ఈ మేరకు హాస్టల్లో 120 మంది విద్యార్థినులకు కేవలం 2 లీటర్ల పాలు, ఒక గ్లాస్ చక్కెర మాత్రమే అందిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మెనూ బోర్డుపై ఉన్న వంటకాలు కాగితం మీదకే పరిమితమయ్యాయని, తాగునీటికి మినరల్ వాటర్ లేక బోర్ నీళ్లతో ఇబ్బంది పడుతున్నామని తెలిపారు.