'వైసీపీ జెండాను మరోసారి ఎగురవేస్తాం'
PLD: నరసరావుపేటలో మాజీ మంత్రి విడదల రజని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిలకలూరిపేటలో కంచుకోటను బద్దలు కొట్టి, 2019లో జగన్ ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులతో వైసీపీ జెండాను ఎగురవేశామని విడదల రజిని ఘాటుగా వ్యాఖ్యానించారు. టైమ్ వచ్చినపుడు వైసీపీ జెండా మరలా చిలకలూరుపేటలో ఎగురవేస్తామని శనివారం ఆమె మీడియా ముందు తేల్చి చేప్పారు.