పామిడి ఎస్సై రాఘవేంద్రప్పకు బీజేపీ నేతల సత్కారం
ATP: పామిడి మండల నూతన సబ్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన రాఘవేంద్రప్పను భారతీయ జనతా పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు నిష్పక్షపాతంగా కృషి చేస్తూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువమోర్చా జిల్లా నేత రాజశేఖర్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మనోజ్ పాల్గొన్నారు.