జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా టెక్నికల్ అధికారిగా పవన్

జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా టెక్నికల్ అధికారిగా పవన్

కర్నూలు అవుట్‌డోర్ స్టేడియం జిమ్నాస్టిక్స్ శిక్షకుడు తోట పవన్ కుమార్‌కు జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో కీలక పదవి దక్కింది. ఫెడరేషన్ టెక్నికల్ అధికారిగా పవన్ ఎన్నికైనట్లు జిల్లా జిమ్నాస్టిక్ సంఘం కార్యదర్శి నాయబ్ రసూల్ తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కుమార్‌ను డీఎఫ్‌డీవో భూపతిరావు, స్పోర్ట్స్ అథారిటీ శిక్షకులు, రాష్ట్ర సంఘం నాయకులు అభినందిచారు.