అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

SRD: సంగారెడ్డి కలెక్టరేట్‌లో ఇవాళ నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ పి. ప్రావీణ్య బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను పెండింగ్‌లో పెట్టకుండా తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉంటూ క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించాలని ఆమె దిశానిర్దేశం చేశారు.