VIDEO: స్త్రీ శక్తి పథకాన్ని పరిశీలించిన ప్రజా రవాణా అధికారి

KKD: స్త్రీ శక్తి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారని జిల్లా ఏపీఎస్ఆర్టీసీ ప్రజా రవాణా అధికారి ఎం.శ్రీనివాసరావు వెల్లడించారు. బుధవారం ఆర్టీసీ డిపోలో ఆయన మహిళలు చేస్తున్న ప్రయాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మహిళా ప్రయాణికులకు పలు సూచనలు చేశారు. ప్రయాణం చేసే ప్రతి మహిళ వద్ద ఆధార్ కార్డ్ గాని రేషన్ కార్డ్ గాని ఓటర్ కార్డ్ గాని ఉండాలని తెలిపారు.