ఇరాన్‌ క్లస్టర్‌ ఆయుధాలు వాడుతోంది: ఇజ్రాయెల్‌

ఇరాన్‌ క్లస్టర్‌ ఆయుధాలు వాడుతోంది: ఇజ్రాయెల్‌

ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు తమపై ఇరాన్ ప్రయోగించిన 300 బాలిస్టిక్ క్షిపణుల్లో సగం క్లస్టర్ బాంబుల్ని మోసుకొచ్చాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించింది. అయితే, భారీ వార్‌హెడ్‌ను మోసుకొచ్చిన ఓ క్షిపణి మాత్రం జెరూసలెం సమీపంలో పేలిపోయిందని తెలిపింది. ఫొటోలు, వీడియోల ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించింది.