సమస్యలు పరిష్కరించాలని సీపీఎం డిమాండ్

NGKL: బిజినపల్లి మండల కేంద్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు గుంపల్లి అశోక్ ఈరోజు డిమాండ్ చేశారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, అధ్వానంగా ఉన్నాయని, సర్పంచ్ లేకపోవడంతో పాలను కుంటుపడిందని తెలిపారు. తక్షణమే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. ఈ సమస్యలను పరిష్కరించకపోతే నిరసన చేపడతామని వారు హెచ్చరించారు.