రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
BDK: మణుగూరు పట్టణంలోని ఎస్బీహెచ్ కల్వర్టు సమీపంలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రాజుపేటకు చెందిన పూర్ణ అనే వ్యక్తి వాహనం అదుపుతప్పి కింద పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో అతని తలకు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు మణుగూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.