నేడు సమాచార శాఖ మంత్రి గూడూరు రాక

నేడు సమాచార శాఖ మంత్రి గూడూరు రాక

TPT: రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శుక్రవారం గూడూరుకు రానున్నారు. నెల్లూరు జిల్లా పర్యటన ముగించుకొని సాయంత్రం 6 గంటలకు గూడూరు లోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. కళాశాల స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి సందర్భంగా జరుగుతున్న సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఆయన పాల్గొనడం జరుగుతుంది.