'లింగ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు'
VZM: చీపురుపల్లి RDO కార్యాలయంలో PC&PNDT చట్టం అమలుపై గురువారం సమీక్షా నిర్వహించారు. ఈ మేరకు చీపురుపల్లి పరిధిలోని ఏ ఆసుపత్రిలో కూడా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించరాదని, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని AO ఈశ్వరమ్మ హెచ్చరించారు. ఈ మేరకు చట్టం ఉల్లంఘనలపై ఈ సందర్బంగా పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డాక్టర్ అర్చన, ఎస్సై దామోదర్, తదితరులు పాల్గొన్నారు.