డ్రైనేజీ కాలువ నిర్మించాలని గ్రామస్తులు నిరసన

అనంతగిరి: బొర్రా పంచాయతీ నిన్నిమామిడి గ్రామస్థులు డ్రైనేజీ కాలువ నిర్మించాలని మంగళవారం ఆయా గ్రామ యువకులు, మహిళలు నిరసన చేపట్టారు. వారు మాట్లాడుతూ.. డ్రైనేజీ కాలువ లేక మురుగు నీరు విధికి చేరి దుర్వాసన వెదజల్లి పారిశుధ్యం ఏర్పడుతుందని అన్నారు. దాని నుండి తరచు గ్రామాలలో రోగుల బారిన పడుతున్నామని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించాలని కోరారు.