VIDEO: మండుటెండల్లోనూ చెక్ డ్యామ్ మత్తడి

VIDEO: మండుటెండల్లోనూ చెక్ డ్యామ్ మత్తడి

SDPD: ఓ వైపు ఎండలు మండుతున్నా నంగునూరు మండలంలోని పెద్దోళ్ల బావి చెక్ డ్యామ్ జలకళను సంతరించుకుంది. నాగరాజుపల్లి చౌడ చెరువు నిండిన జలాలు పెద్ద వాగులోకి పరవళ్లు తొక్కుతున్నాయి. ఈ నీరు ఘనపూర్ పంప్ హౌస్‌కు చేరుతుండటంతో త్వరలోనే పంపులు ఆన్ చేస్తామని ఏఈఈ రాజు తెలిపారు. దీనివల్ల ఘనపూర్, అక్కెనపల్లి, గట్లమల్యాల, ఖాతా గ్రామాల్లోని పంట పొలాలకు సాగునీరు అందనుంది.