రైతులను మోసం చేస్తున్న పొగాకు కంపెనీలు

రైతులను మోసం చేస్తున్న పొగాకు కంపెనీలు

GDWL: పొగాకు సాగు చేయండి క్వింటా రూ.15 వేల చొప్పున కొంటాం అని కంపెనీలు చెప్పడంతో రైతులు నమ్మారు. అలంపూర్, ఉండవల్లి, గట్టు మండలాల పరిధిలో ఎక్కువగా, ఇతర మండలాలతో కలిపి జిల్లా వ్యాప్తంగా సుమారు 8 వేల ఎకరాల్లో రైతులు పంటను సాగుచేశారు. తీరా దిగుబడులు చేతికి వచ్చి కంపెనీ గోదాం వద్దకు తీసుకెళితే రూ.10 వేలే చెల్లిస్తామని చెబుతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.