ఎమ్మిగనూరు ప్రమాదంలో మృతులు వీరే!
KRNL: ఎమ్మిగనూరు మండలం కోటేకల్ వద్ద రెండు కార్లు ఢీకొన్న ఘటనలో మృతుల వివరాలు లభ్యమయ్యాయి. కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా చిక్క హోసల్లి మండలం బంగారు పేటకు చెందిన ఐదుగురు ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు. మృతి చెందిన వారిలో వెంకటేశప్ప (76), సతీశ్ కుమార్ (34), మీనాక్షి (32), బణీత్ గౌడ (5), రిత్విక్ (4) ఉన్నారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.