రేపు జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండండి
కోనసీమ: రేపు జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని APSMDA హెచ్చరించింది. దీంతో జిల్లా ప్రజలను అప్రమత్తం చేసింది. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని.. పిడుగులు పడే అవకాశం ఉండటంతో చెట్ల కింద ఉండరాదని సూచించింది. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవాలని కోరింది.