'పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి'
KDP: కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి శుక్రవారం వేంపల్లె ప్రధాన రోడ్డు పనులను పరిశీలించి, పనులు తిరిగి ప్రారంభం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గత వైకాపా పాలనలో వేంపల్లె పట్టణ సుందరీకరణకు 4 లైన్ల సీసీ రోడ్డు మంజూరైందని, అయితే 2025 మార్చి నాటికి పూర్తి కావాల్సిన పనులు నిలిచిపోయాయన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పనులు పున: ప్రారంభమయ్యాయన్నారు.