బంగారు పతకం సాధించిన విద్యార్థిని సన్మానించిన కలెక్టర్
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో శనివారం బాన్సువాడ గ్రామానికి చెందిన విద్యార్థి శశిధర్‌ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాల్ బ్యాడ్మింటన్ క్రీడలో ప్రతిభ కనబరుస్తున్న శశిధర్ రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక పోటీలలో పాల్గొని మంచి ప్రతిభ చాటుకున్నాడని కలెక్టర్ ప్రశంసించారు. శశిధర్ ఇప్పటికి 7 సార్లు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్నాడు.