ప్రకాశం బ్యారేజ్ వద్ద పెరిగిన ప్రవాహం
NTR: ప్రకాశం బ్యారేజి వద్ద ఆదివారం ఉదయం ఇన్ఫ్‌లో / అవుట్ ఫ్లో గణనీయంగా పెరిగింది. దీంతో బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని సమాచారం ఉందని అధికారులు వెల్లడించారు. ఎగువ నుంచి వరద నీరు వస్తున్నందున నదిలో ఈతకు దిగవద్దని లంక గ్రామాల ప్రజలకు అధికారులు సూచించారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.