గొర్లవేడులో సంబరాలు చేసుకున్న బీజేపీ నేతలు
BHPL: బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ఘనవిజయం సాధించడంతో భూపాలపల్లి మండలం గొర్లవేడులో ఇవాళ బీజేపీ కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. బూత్ అధ్యక్షుడు తాళ్ల దుర్గయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి శివరాత్రి వేణు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలు పటాకులు కాల్చి, మిఠాయిలు పంచుకుని సంతోషం వ్యక్తం చేశారు.