VIDEO: స్కూల్ బస్సు కిందపడి బాలుడు మృతి

VIDEO: స్కూల్ బస్సు కిందపడి బాలుడు మృతి

GNTR: పెదనందిపాడు మండలం వరగానిలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. నాగులపాడు శ్రీనివాస సీబీఎస్ఈ స్కూల్ బస్సు కింద పడి వరగానికి చెందిన యూకేజీ విద్యార్థి కూచపూడి కృప అన్వేష్(4) మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.