52 పరుగుల దూరంలో స్మృతి
టీమిండియా స్టార్ మహిళా ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన రికార్డుకు చేరువలో ఉంది. సౌతాఫ్రికాతో జరగనున్న వరల్డ్ కప్ ఫైనల్‌లో.. ఆమె మరో 52 పరుగులు చేస్తే ప్రపంచకప్‌లో 1000 పరుగులు చేసిన పదో బ్యాటర్‌గా నిలుస్తోంది. అలాగే, భారత్ తరఫున మూడో బ్యాటర్‌గా మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్ తర్వాతి స్థానంలో స్మృతి నిలవనుంది.