చిరు వ్యాపారి మృతి.. కుటుంబానికి ఆర్థిక సాయం

చిరు వ్యాపారి మృతి.. కుటుంబానికి ఆర్థిక సాయం

KRNL: ఆదోని ఇందిరానగర్‌కు చెందిన చిరు వ్యాపారి ఈరన్న(55) అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. మట్టి ఖర్చుల కోసం రూ.5వేలు ఆర్థిక సహాయం అందజేశారు. పేద కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ చలపతి తదితరులు పాల్గొన్నారు.