ట్విటర్ కొనుగోలులో మస్క్ మోసాలు!
ట్విట్టర్‌ను కొనుగోలు చేసే క్రమంలో ప్రపంచ కుబేరుడు మస్క్ మోసానికి పాల్పడినట్లు జ్యూరీ నిర్థరించింది. ట్విట్టర్‌ను కొనడానికి కొన్ని నెలల ముందు ఉద్దేశపూర్వకంగానే పెట్టుబడిదార్లను గందరగోళానికి గురి చేసినట్లు అభిప్రాయపడింది. దాని వల్ల ట్విట్టర్ షేర్ల విలువ పడిపోయినట్లు తెలిపింది. అయితే స్టాక్ విలువను తగ్గించడానికే కుట్ర పన్నారనే ఆరోపణలను మాత్రం ఖండించింది.