VIDEO: బోల్తా పడిన ట్రాక్టర్.. ఆరుగురికి తీవ్ర గాయాలు...

VIDEO: బోల్తా పడిన ట్రాక్టర్.. ఆరుగురికి తీవ్ర గాయాలు...

MLG: ఏటూరునాగారం మండల కేంద్రంలో 163 జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మిర్చి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఇసుక లారీ ఢీకొనడంతో ట్రాక్టర్ బోల్తా పడింది. ట్రాలీలో ఉన్న నలుగురు, ఇంజిన్‌పై కూర్చున్న మరో ఇద్దరు ఎగిరిపడగా తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.