ఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకోండి: ఎంపీడీవో

ఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకోండి: ఎంపీడీవో

NDL: ఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కొత్తపల్లి ఎంపీడీవో మేరీ పేర్కొన్నారు. ఈనెల 9 నుంచి13 తేదీల్లో క్యాంపులు నిర్వహించనున్నారు. ఈనెల 9, 10న దుద్యాల, 11న ఎదురుపాడు, 12న కొత్తపల్లి, 13న గువ్వలకుంట్ల గ్రామపంచాయతీలో ఆధార్ క్యాంపులు ఉంటాయన్నారు. కొత్తగా ఆధార్ కార్డు నమోదు చేసుకునేవారు, ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకోవాల్సిన వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు.