ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: తహసిల్దార్
అన్నమయ్య: మొంథా తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామాపురం మండల తహసిల్దార్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇవాళ తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దన్నారు. గాలులు వీచే సమయంలో చెట్ల కింద ఉండకూడదన్నారు. మండలంలోని ప్రతి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.