తెలంగాణ ఉద్యమ నాయకులు కొండ లక్ష్మణ్ బాపూజీ: ఎమ్మెల్యే
NLG: నిజాం నిరంకుశ వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకులు కొండ లక్ష్మణ్ బాపూజీ అని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం కొండ లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రాజు, పద్మశాలి సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.