ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
SRCL: ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం నిర్మాణానికి ఉదయం ప్రభుత్వ విప్ భూమి పూజ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామన్ గుడ్ ఫండ్ ద్వారా ఎన్నో ఆలయాలకు నిధులు మంజూరు చేసిందన్నారు.