'బాల్యం నుంచే నైతిక విలువలు నేర్పాలి'
TPT: తల్లిదండ్రులు బాల్యం నుంచే పిల్లలకు నైతిక విలువలు, ధర్మాలు నేర్పాలని సైకాలజిస్ట్ ఎన్ బి. సుధాకర్ రెడ్డి సూచించారు. ఈ మేరకు గురువారం ఏర్పేడు గ్రామంలో వ్యక్తిత్వ నిర్మాణంలో తల్లిదండ్రుల పాత్రపై శిక్షణ ఇచ్చారు. తల్లి ఆరోగ్యం, ఆలోచనలు పిల్లల మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయన్నారు. తండ్రిని ఎక్కువ శాతం పిల్లలు ఆదర్శంగా తీసుకుంటారని తెలిపారు.