VIDEO: అత్తపై మేనల్లుడు కత్తితో దాడి

NDL: పరిధిలోని రైల్వే స్టేషన్ రోడ్ నాగులకట్ట వద్ద సోమవారం కొబ్బరిబొండాల కత్తితో ఓ మహిళపై దాడి చేసిన ఘటన జరిగింది. షేక్ రేహమున్నిసా అనే మహిళ బైక్‌పై వెళ్తుండగా మేనల్లుడు అబ్దుల్ రెహమాన్ బైక్ ఆపి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఆస్తి విషయంలో వివాదం కారణంగా ఈ దాడి జరిగినట్లు సమాచారం. బాధితురాలిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.