VIDEO: దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించిన షర్మిల
KDP: సింహాద్రిపురం(మం) కసనూరులో ఇటీవల ఈదురుగాలులు, వడగండ్ల వానకు నేలకొరిగిన అరటిపంటలను మంగళవారం సాయంత్రం ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పరిశీలించారు. గ్రామానికి చెందిన రైతు శివానందరెడ్డి సాగుచేసిన అరటిపంటను ఆమె పరిశీలించి పంట నష్టం గురించి మాట్లాడారు. పంట ఎంత మేర దెబ్బతినింది, ఎంత నష్టపోయారు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు.