అలరిస్తున్న మంచు మేఘాల అందాలు

అలరిస్తున్న మంచు మేఘాల అందాలు

ASR: పెదబయలు మండలం బొయితిలి సమీపంలో ఉన్న కొండపై పాల సముద్రాన్ని తలపించేలా కనిపిస్తున్న మంచు మేఘాలు అలరిస్తున్నాయి. వీకెండ్ ఆదివారం కావడంతో పలువురు పర్యాటకులు మంచు మేఘాల అందాలు వీక్షించేందుకు అక్కడకు వెళుతున్నారు. సూర్యోదయం నడుమ మంచు మేఘాల అందాలు తనివితీరా ఆస్వాదిస్తున్నారు. పాడేరు నుంచి సుమారు 12కిలోమీటర్లు, అరకు నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది.