జైనమత కేంద్రంగా నంగునూరు

SDPT: జైన మత ప్రధాన కేంద్రంగా నంగునూరు పరిసర ప్రాంతాలు విరాజిల్లినట్టు కొత్త తెలంగాణ చారిత్రక బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నంగునూరు పరిసర ప్రాంతాలైన ధూల్మిట్ట, బైరాన్ పల్లి, పూల్లూరు, పొట్లపల్లి, నర్మెట్ట గ్రామాల్లో జైన మతానికి సంబంధించి అనేక ఆనవాళ్లు లభించాయని తెలిపారు.