రైతులు కల్లాలను ఏర్పాటు చేసుకోవాలి: ఎమ్మెల్యే

రైతులు కల్లాలను ఏర్పాటు చేసుకోవాలి: ఎమ్మెల్యే

KMR: కల్లాలను రైతులు ఏర్పాటు చేసుకోవాలని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చెప్పారు. మండలంలోని కాచాపూర్ గ్రామంలో రైతు కల్లాల ఏర్పాటుపై ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలను ఆరబెట్టేందుకు రైతు కల్లాలు ఎంతో అవసరమని చెప్పారు. ఇందుకోసం తన వంతు సహకారం ఎల్లవేళలా రైతులకు ఉంటుందని చెప్పారు.