మిర్యాలగూడలో ఘనంగా సంత్ సేవలాల్ జయంతి

NLG: గిరిజనుల ఆరాధ్య దైవం సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతిని శనివారం మిర్యాలగూడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ఎండిఓ కార్యాలయం నుంచి బంజారా భవన్ వరకు ర్యాలీ చేపట్టారు. గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలను చాటుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.