BYPOLL: బాధ్యతగా.. ఓటేద్దాం పదండి!
TG: వారికి అవయవాలు సరిగా పనిచేయవు.. ఒంట్లో శక్తి లేదు.. అయినా ఓటేసే బాధ్యత మరవలేదు.. జూబ్లీహిల్స్‌లో 103 మంది వృద్ధులు హోమ్ ఓటింగ్‌కు అప్లై చేయగా.. 101 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. మిగిలిన ఇద్దరు అంతకుముందే మరణించారు. అంటే దాదాపు అందరూ ఓటేశారు. శరీరం సహకరించకపోయినా వాళ్లు ఓటేశారు. మరి మిగతా వారు వాళ్లు ఇచ్చిన స్ఫూర్తితో ఓటేసేందుకు కదలిరండి.