జనగామలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి పూజలు
జనగామ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి, అభయాంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి పురస్కరించుకుని అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు ఆలయానికి రావడంతో ఆలయంలో సందడి నెలకొంది. పూజా కార్యక్రమం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అర్చకులు భక్తులకు అందజేశారు.