రైతు సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది : ఎమ్మెల్యే
MBNR: రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి అన్నారు. భూత్పూర్ మండలం పోతులమడుగు తాటికొండ గ్రామాలలో సోమవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద అమ్ముకోవాలని సూచించారు.