యువత దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలి: ఎస్పీ
WNP: యువత చదువు, క్రమశిక్షణ, సమాజ సేవతో దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని శనివారం ఎస్పీ రావుల గిరిధర్ పిలుపునిచ్చారు. మన దేశం కేవలం సరిహద్దులతో కాకుండా, మనసుల ఐక్యతతో బలంగా ఉంటుందన్నారు."ఐక్యత అంటే మనమంతా ఒక కుటుంబం అన్న భావనతో ముందుకు సాగడమే" అని పేర్కొన్నారు. యువత ఒక లక్ష్యం, ఒక దిశ, ఒక దేశం కోసం పరుగెత్తి, ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని ఆయన పేర్కొన్నారు.