కొట్టుకుపోయిన శ్రీకాకుళం-కొల్లూరు మట్టి రహదారి

కొట్టుకుపోయిన శ్రీకాకుళం-కొల్లూరు మట్టి రహదారి

కృష్ణా: ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామం నుంచి కొల్లూరు మీదుగా గుంటూరుకు వెళ్లే(కృష్ణా నదిలో ఉన్న)మట్టి రోడ్డు రాత్రి వరద ధాటికి కొట్టుకుపోయింది. దీంతో ప్రజలు అటువైపు వెళ్లవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో రహదారి పూర్తిగా నీట మునిగిపోయింది.