ప్రభుత్వ పాలనపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరణ

MNCL: జైపూర్ మండలంలోని పౌనూర్ గ్రామంలో శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అప్పుడే మంచిగుండే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ.. పదేళ్ళ కేసీఆర్ పాలనలో చేపట్టిన మంచి పనులను ప్రజలకు వివరించి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. ప్రజలు మళ్ళీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని తెలిపారు.