రైలు ఢీకొని వృద్ధుడు మృతి

ELR: బహిర్భూమికి వెళ్లిన వృద్ధుడిని గుర్తు తెలియని రైలు ఢీకొనడంతో ఘటన స్థలంలోనే మృతి చెందిన ఘటన ఏలూరు రైల్వే స్టేషన్ పరిధిలోని కోడూరుపాడు రైల్వే గేట్ సమీపంలో జరిగింది. మృతుడు కృష్ణా జిల్లా కోడూరుపాడుకు చెందిన చిట్టి బొమ్మల ఏడుకొండలు(58)గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.