లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఇవాళ జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మండలంలోని 65 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.