ఎక్కువ సేపు కూర్చుంటున్నారా?
ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవడం వల్ల ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కదలకుండా కూర్చోవడం వల్ల శరీరంలోని మెటాబాలిజం తగ్గుతుంది. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకునే ప్రమాదం పెరుగుతుంది. వెన్నెముక, కండరాలు బలహీనపడడం మొదలవుతుంది. గుండె జబ్బులు, డయాబెటిస్, ఊబకాయం వంటివి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.