నేడు తేలనున్న కడియం భవితవ్యం

నేడు తేలనున్న కడియం భవితవ్యం

JN: స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ నమోదైన పిటిషన్‌పై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ జరిపారు. ఈ విచారణకు సంబంధించిన తుది తీర్పును ఇవాళ ఉదయం 10 గంటలకు వెలువరించనున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా ప్రజలల్లో స్పీకర్ తీర్పుపై ఆసక్తి నెలకొంది.