మాజీ మంత్రి జోగి రమేశ్‌కు బిగుస్తున్న ఉచ్చు!
AP: నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన అద్దేపల్లి జనార్దనరావు, జగన్మోహనరావు.. సిట్ అధికారుల విచారణలో జోగి రమేశ్ పేరును వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆయన ప్రోత్సాహం, అభయంతోనే తాము 2022 నుంచి నకిలీ మద్యం వ్యాపారాన్ని కొనసాగించామని వారు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం.