పవన్ కళ్యాణ్‌కు మిథున్ రెడ్డి సవాల్
AP: మంగళంపేట భూములపై చేసిన ఆరోపణలను నిరూపించాలని Dy.CM పవన్ కళ్యాణ్‌కు MP మిథున్ రెడ్డి సవాల్ విసిరారు. ఆ భూములను తాము 2000 సం.లోనే చట్టబద్దంగా కొనుగోలు చేశామని వెల్లడించారు. దానికి సంబంధించిన రికార్డులన్నీ ఉన్నాయని, వాటిని ఆన్ లైన్‌లో చెక్ చేసుకోవచ్చంటూ సవాల్ విసిరారు. గతంలో ఎర్రచందనం విషయంలోనూ ఆరోపణలు చేసి పారిపోయారని ఎద్దేవా చేశారు.